బియ్యం పాయసం రెసిపి

Photo of author

By Ravikiran V

Share this article

అందరికీ నమస్కారం ఎంతో రుచికరమైన బియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలి అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పాయసం అనేది ప్రతి ఒక్కరూ  ఖచ్చితంగా ఇష్టంగా తినగలుగుతారు. మన తెలుగు రాష్ట్రాలలో చిన్న పెద్ద అనే పండగలకు ఖచ్చితంగా చేసే ప్రసాదం ముఖ్యంగా ఈ ప్రసాదాన్ని ప్రత్యేకమైన పూజలలో చేస్తూ ఉంటారు కొన్ని  ముఖ్యమైన పూజలలో ఈ ప్రసాదం లేకుండా పూజని పూర్తి చేయరు. అలాంటి ఈ ప్రసాదాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు నెయ్యి,జీడిపప్పు ,కిస్మిస్, బెల్లం, బియ్యం,పాలు  అనే పదార్థాలను తీసుకోవాలి .ఈ పదార్థాలు తీసుకున్న తర్వాత ముందుగా నెయ్యి వేడి చేసి అందులో జీడిపప్పు, కిస్మిస్ ని దోరగా వేయించాలి .ఇలా వేయించి నా వాటిని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో బియ్యాన్ని చక్కగా అన్నం లాగా ఉడికించుకోవాలి. అలా ఉడికించిన అన్నం లో బెల్లం వేసి బెల్లం కరిగే వరకు అన్నంతో కలిపి ఉడికించాలి .అలా ఉడికిన అన్నంలో కాచిన పాలను అలాగే జీడిపప్పు, కిస్మిస్ తో గార్నిష్ చేసుకోవాలి. కొంతమంది ఈ బియ్యాన్ని డైరెక్ట్ గా పాలల్లోనే ఉడికిస్తారు. అలా చేసుకోవడం కారణంగా బెల్లం వేసినప్పుడు పాలు విరిగిపోతాయి .కాబట్టి ముందుగా నీళ్లలో అన్నం ఉడికించుకున్న తర్వాత చివర్లో పాలు పోసుకుంటే పాలు ఇరగకుండా ఉంటాయి. ఇలా చేసుకున్న ఈ పాయసాన్ని వేడిగా గాని చల్లగా గాని స్వీకరించవచ్చు. సో విన్నారు కదా బియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలి అనేది .

Leave a Comment