ANdhra news : మళ్ళీ గెలవాలనే లక్ష్యంగా జగన్..

Photo of author

By sri645

Share this article

2 రోజుల విరామం తర్వాత మళ్లీ వైసీపీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పలు జిల్లాల నేతలతో సమావేశమైన వైసీపీ అధినేత, సీఎం జగన్ ఈరోజు ఉత్తరాంధ్ర నేతలతో సమావేశమవుతున్నారు. రెండు, మూడు రోజుల్లో ఒకేసారి తుది జాబితా ప్రకటిస్తారనే టాక్ రావడంతో నేతల్లో టెన్షన్ నెలకొంది. ఇక ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు టికెట్ టెన్షన్ దగ్గర పడుతోంది…

jagan mohan reddy latest

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే గెలుపు గుర్రాలను సిద్ధం చేయడం ప్రారంభించారు. ఇప్పటికే పలు జిల్లాల నేతలతో సమావేశమైన జగన్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇటీవల ఈ ప్రక్రియకు రెండు రోజులు అంతరాయం ఏర్పడగా, మంగళవారం నుంచి మళ్లీ ప్రారంభం కానుంది.

రెండు రోజుల విరామం తర్వాత మళ్లీ వైసీపీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పలు జిల్లాల నేతలతో భేటీ అయిన వైసీపీ అధినేత, సీఎం జగన్ ఈరోజు ఉత్తరాంధ్ర నేతలతో సమావేశమవుతున్నారు. రెండు, మూడు రోజుల్లో ఏకకాలంలో తుది జాబితా ప్రకటిస్తారనే టాక్ తో నేతల్లో టెన్షన్ నెలకొంది. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు టికెట్ టెన్షన్ దగ్గర పడుతోంది. 175 టార్గెట్ తో ముందుకు సాగుతున్న వైసీపీ గెలుపు గుర్రాల ఎంపికపై దృష్టి సారించింది.

స్వల్ప విరామం తర్వాత మళ్లీ నేటి నుంచి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ ఉత్తరాంధ్ర నేతలతో వైసీపీ అధినేత, సీఎం జగన్ భేటీ అవుతున్నారు. దీంతో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనన్న టెన్షన్ నేతల్లో నెలకొంది. రెండో జాబితా ప్రకటనకు బ్రేక్ పడింది.. అదే గ్యాప్ లో కొత్త సంవత్సరం కూడా రావడంతో.. అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు నేతలకు మంచి టైమింగ్ వచ్చింది. తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ కొందరు నేతలు అధినేతను కలిశారు.

వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు నిన్న ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద ఎత్తున సీఎంవో వద్ద క్యూ కట్టారు. సీఎంతో పాటు కీలక అధికారులను అభినందించారు. మంత్రి జోగి రమేష్‌, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు, కైలె అనిల్‌ కుమార్‌, విజయవాడ తూర్పు ఇంచార్జి దేవినేని అవినాష్‌, ఎమ్మెల్సీ మండితోక జగన్‌ మోహన్‌రావు తదితరులు సీఎంఓ వద్దకు వచ్చి ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. కేవలం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చానని, మరో కారణం లేదని అన్నారు.

వైసీపీ ఇప్పటికే సర్వేల ఆధారంగా నేతలను ఫిల్టర్ చేస్తోంది. ఇప్పటికే తొలిజాబితాలో నో కాంప్రమైజ్ అంటూ 11 స్థానాలను మార్చేశారు. ఎక్కడ మార్పులు జరిగినా సీఎం జగన్ స్వయంగా ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లను సీఎంవోకు పిలిపించి మాట్లాడుతున్నారు. గత 10 రోజులుగా ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి విశాఖపట్నం, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల నేతలను పిలిపించి మాట్లాడారు. ఎట్టకేలకు ఆయా జిల్లాలో కసరత్తు పూర్తయింది.

కాగా, నేటి నుంచి మిగిలిన జిల్లాలు, పెండింగ్ స్థానాలపై అధినేత జగన్ దృష్టి సారిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా వైసీపీ నేతలు చెప్పినట్లుగా రెండు మూడు జాబితాలకు భిన్నంగా మరో రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో తుది జాబితాను సిద్ధం చేసి విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే శుక్రవారం నాటికి వైసీపీ తుది జాబితా ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. దీనితో అదృష్టవంతులు ఎవరు? నేతల భవితవ్యం తేలిపోతుంది.