మచిలీపట్నంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో కోవిడ్ కలకలం సృష్టిస్తోంది. గత రెండు రోజుల క్రితం ఆశ్రమంలోని ఒక వృద్ధుని కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు ఆశ్రమంలో ఉన్న 47 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరి లో మరో నలుగురికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన ఐదుగురికి సర్వజన ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగంలో చికిత్స అందిస్తున్నారు. కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.