స్వామివారి భక్తులకు ఒకేచోట అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా వెబ్సైట్ ttd website పేరును మారుస్తూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే కంపెనీ, ఒకే వెబ్సైట్, ఒకే మొబైల్ యాప్ అనే నిర్ణయంతో పేరు మార్చినట్లు ప్రకటించింది. భక్తులు శ్రీవారి దర్శనం కోసమో, ఆలయ వివరాల కోసమో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఇక నుంచి కొత్త వెబ్సైట్ను వినియోగించుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలను అందించే అధికారిక వెబ్సైట్ పేరును మరోసారి ప్రకటించారు. ఇంతకుముందు tirupatibalaji.ap.gov.inగా ఉన్న TTD వెబ్సైట్ పేరు ఇప్పుడు ttdevasthanams.ap.gov.inగా మార్చబడింది. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. హిందూ మతానికి ప్రాచుర్యం కల్పించేందుకు తిరుపతితో పాటు ఇతర ప్రాంతాల్లోని టీటీడీ అనుబంధ ఆలయాల వివరాలన్నింటినీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ttdevasthanams.ap.gov.in అనే కొత్త వెబ్సైట్ను ప్రారంభించారు. ‘వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్సైట్, వన్ మొబైల్ యాప్’లో భాగంగా పేరు మార్పు చేసినట్లు ఆలయ అధికారిక వెబ్సైట్ వెల్లడించింది. ఇక నుంచి శ్రీవారి భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు.
స్వామివారి భక్తులకు ఒకేచోట అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా వెబ్సైట్ పేరును మారుస్తూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే కంపెనీ, ఒకే వెబ్సైట్, ఒకే మొబైల్ యాప్ అనే నిర్ణయంతో పేరు మార్చినట్లు ప్రకటించింది. భక్తులు శ్రీవారి దర్శనం కోసమో, ఆలయ వివరాల కోసమో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఇక నుంచి కొత్త వెబ్సైట్ను వినియోగించుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది.