bhakti : అష్టైశ్వర్యాలు , భోగబాగ్యాలు ఇచ్చే మంత్రం

Photo of author

By sri645

Share this article

Bhakti

suvarna kamala  hasini mantram

జీవితంలో అష్టైశ్వర్యాలు , భోగబాగ్యాలు , సకల సంపదలు కలగలంటే , తరతరాలు సమపదలతో విరాజిల్లలంటే మంత్ర శాస్త్రంలో చెప్పినటువంటి సువర్ణ కమల హాసిని మంత్రాన్ని ఏ విధంగా జపించుకోవాలో చూద్దాం . కానీ

మంత్ర శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు చెప్పడం జరగింది వాటిలో చాలా శక్తివంతమైన మంత్రం సువర్ణ కమల హాసిని మంత్రం . ఈ సువర్ణ కమల హాసిని మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే , ఎవరైతే ఈ సువర్ణ కమల హాసిని మంత్రాన్ని 40 రోజుల పాటు రోజూ సాయంకాలం పుట సంధ్య దీపం వెలిగించిన తరువాత రోజుకి 11 సార్లు చొప్పున చదువుతారో వారికి 40 రోజులూ పూర్తి అయిన తరువాత తొందరలోనే అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయి . ఐశ్వర్యము ,భోగ భాగ్యాలు సకల సంపదలు కల్గడంతో పాటుగా తరతరాలు తిన్న కూడా తరగని ఆస్తి భవిష్యత్తులో లభించడానికి కూడా ఈ సువర్ణ కమల హాసిని మంత్రం చాలా అద్భుతంగా సహకరిస్తుంది . ఈ మంత్ర జాప్యం ఎలా చేయాలంటే రోజూ సాయంకాలం పూట ఆడవాళ్ళు సంధ్యకాలంలో పూజ మందిరంలో దీపం పెట్టాలి అలా దీపం పెట్టిన తరువాత ఇంటి యజమాని లేదా యజమానురాలు అయిన సరే , శ్రీ మహాలక్ష్మికి కుంకుమాతో పూజ చేస్తూ ఈ సువర్ణ కమల హాసిని మంత్రాన్ని 11 సార్లు చదువుకోవాలి

ఆ మంత్రం ఏమిటంటే

సౌమ్య భోగ్యా మహాభాగ్యా భోగిని భాగ్యా దాయినీ
సుసౌధ కనక ప్రఖ్యా సువర్ణ కమల హాసిని

ఇది మంత్రం . చాలా శక్తివంతమైన మంత్రం . ఈ మంత్రాన్ని సంధ్య దీపం పెట్టిన తరువాత లక్ష్మీ దేవి ఫోటోకి కుంకుమాతో పూజ చేస్తూ 11 సార్లు చదువుకోవాలి , ఇలా 40 రోజుల పాటి చేయాలి ,ఆడవారికి మధ్యలో ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బంది 4 రోజులూ విడిచి పెట్టి లెక్కపెట్టుకుని ఈ మంత్రం చదువుకోవచ్చు .40 రోజులూ పూర్తి అయిన తరువాత , లక్ష్మీ దేవికి ఏ కుంకుమాతో అయితే పూజ చేశామో ఆ కుంకుమను రోజూ బొట్టులాగా పెట్టుకోవాలి. యజమాని యజమానురాలు ఇద్దరు కూడా కుంకుమను బొట్టులాగా పెట్టుకోవాలి . ఇలా చేస్తే విశేషంగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరిసంపదలు కలుగుతాయి . 40 రోజులూ మంత్ర జాప్యం పూర్తి అయిన తరువాత ఒకసారి ఎక్కడైనా సరే లక్ష్మీ దేవి ఆలయానికి వెళ్ళి లక్ష్మీదేవికి పుష్పాలతో అర్చన చేయించుకోండి ,లక్ష్మీదేవి అర్చనకి ఉపయోగించిన పుష్పాలతో కొన్ని పుష్పాలు తెచ్చి మీరు బిరువలో దాచి పెట్టండి ఆ పుష్పాలను వాడిపోయే వరకు బిరువలోనే ఉంచండి . పుష్పాలు వాడిపోయిన తరువాత ఆ పుష్పాలను తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి . ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించండి . ఇలా సువర్ణ కమల హాసిని మంత్రాన్ని జపించుకోవడం ద్వారా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రులు కావొచ్చు . అలాగే 40 రోజులూ మంత్ర జాప్యం చేసేటప్పుడు లక్ష్మీ దేవికి పాలను నైవేద్యంగా సమర్పించండి . ఆ తరువాత కుటుంభంలోని సభ్యులు అందరూ ఆ పాలను నైవేద్యంగా స్వీకరించండి . ఈ మంత్రాన్ని 40 రోజుల పాటు జపించినప్పటికి ఒక్కోసారి కొంతమందికి జాతక దోషాలు ఎక్కువగా ఉన్న వారికి ప్రయోజనం కనిపించదు , అలాంటి పరిస్థితులలో జాతక దోషాలు ఎక్కువగా ఉన్నవారు 40 రోజుల తరువాత కూడా పెద్దగా ప్రభావం కనిపించనట్లైతే 90 రోజుల పాటు ఈ మంత్ర జాప్యం చేయండి . ఇలా చేయడం వలన జాతకంలో ఎంత తీవ్రమైన దోషాలు ఉన్న సరే ఈ సువర్ణ కమల హాసిని మంత్రం యొక్క ప్రభావం అనేది మీకు బాగా కనిపిస్తుంది . అష్టైశ్వర్యాలు ,భోగభాగ్యాలు ,సకల సంపదలు కలగడానికి ఈ మంత్ర జపం విశేషంగా సహకరిస్తుంది .